నగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో ఆదివాసి వీరుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలమూరు విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ సతీష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
స్వతంత్ర పోరాట వీరుడు బిర్సా ముండా:
అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొక్తల శంతన్ మాట్లాడుతూ...
భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహానీయుల కోవకు చెందిన ఆదివాసి వీరుడు బిర్సా ముండా అని కొనియాడారు.
జన జాతి గౌరవ దినోత్సవం:
బిర్సా ముండా ప్రారంభించిన ఉల్గులాన్ విప్లవంలో వందలాది మంది గిరిజనులు వీరవరం పొందారని, చివరికి ఆయన పట్టుబడి 1900 జూన్ 9వ తేదీన కేవలం 25 ఏళ్ల వయసులో రాంచీ జైల్లో అమరుడయ్యారని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంతన్, పాలమూరు విభాగ్ కన్వీనర్ సతీష్, అర్జున్, అనిల్, సాయి, రాము, వెంకటేష్, కమల్, ప్రసన్న, జ్యోతి తదితర ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
TAGS: ABVP Birsa Munda Jayanti Achampet,Jan Jati Gaurav Diwas Achampet, Birsa Munda 150th Anniversary ABVP, Mokthala Shanthan speech, Government Girls College Achampet,Ensure ABVP, Bhagwan Birsa Munda, Achampet, Jan Jati Gaurav Diwas, Birsa Munda 150th Jayanti, ABVP Achampet news, Jan Jatiya Gaurav Divas, Mokthala Shantan ABVP, Tribal hero Birsa Munda, Achampet Girls College event, Bhagwan Birsa Munda 150th birth anniversary, Birsa Munda jayanti celebrations, ABVP Achampet unit, Government Girls College Achampet event, ABVP Telangana tribal program, Ulgulan movement Birsa Munda, tribal freedom fighter Birsa Munda, Birsa Munda legacy India, Nagarkurnool district student events, ABVP student activities Telangana
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com