నల్లమలలో అర్ధరాత్రి హైడ్రామా - ముగ్గురి అరెస్ట్!
సివిల్ డ్రెస్సులో వచ్చి మరీ తీసుకెళ్లారు.. అసలేం జరిగింది?
ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎంట్రీ.. పోలీసుల అదుపులో నిందితులు.
నల్లమలలో మళ్లీ అలజడి - భయబ్రాంతుల్లో ప్రజలు.
అచ్చంపేట (జనవరి 24, 2026): నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ తీవ్ర కలకలం సృష్టించింది. అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు, అచ్చంపేట మరియు లింగాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో ఉన్న వారిలో ఏపీ సి ఎల్ సి (APCLC) జిల్లా కార్యదర్శి జక్క బాలయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడు అంబయ్య, మరియు మాజీ నక్సలైట్ యాదయ్య ఉన్నట్లు సమాచారం. సివిల్ డ్రెస్సులో వచ్చిన పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి వీరిని తీసుకెళ్లడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రంగంలోకి దిగి ఆరా తీయగా, వారు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదుపులో ఉన్నారని స్పష్టమైంది. 2009 తర్వాత నక్సల్స్ కదలికలు లేక ప్రశాంతంగా ఉన్న నల్లమలలో ఈ ఘటనతో అమ్రాబాద్, పదర, లింగాల మండలాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com