అచ్చంపేట:
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే లక్ష్యంతో హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట మండల స్థాయిలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర, విజయాలు మరియు దేశానికి ఆయన చేసిన సేవలు అనే అంశంపై ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ పోటీలు స్థానిక జడ్పీహెచ్ఎస్ (గర్ల్స్) పాఠశాల నందు ఆర్. జ్యోతిలాల్ (హరిత ఫౌండేషన్ సభ్యులు) ఆధ్వర్యంలో జరిగాయి. మండలంలోని 12 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు డాక్టర్ కలాం గారి గురించి ఎంతో చక్కగా వివరించడం అందరినీ ఆకట్టుకుంది.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: MEO జీవన్ కుమార్:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ జీవన్ కుమార్ మాట్లాడుతూ...
స్థానిక పాఠశాల జీహెచ్‌ఎం సరళ మేడమ్ మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో మహిళలు కూడా అన్ని రంగాలలో ముందు ఉండాలని, కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
విజేతలకు హైదరాబాద్ టూర్ బహుమతి:
హరిత ఫౌండేషన్ సభ్యులు జ్యోతిలాల్ మాట్లాడుతూ...
విజేతలు వీరే:
పోటీల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులు అందజేశారు:
ప్రథమ బహుమతి : బి. అనిల్ - జీహెచ్ఎస్ అచ్చంపేట
ద్వితీయ బహుమతి : పి. అంజలి - జడ్పీహెచ్ఎస్ (గర్ల్స్) అచ్చంపేట
తృతీయ బహుమతి : ఎం. శ్రావణి - పిటిజి (ఐనుల్గార్)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ మొమెంటోస్, సర్టిఫికెట్లు మరియు పుస్తకాలు అందించారు. ఇటువంటి స్ఫూర్తిదాయక కార్యక్రమం నిర్వహించినందుకు ఫౌండేషన్ సభ్యులు ఆర్. జ్యోతిలాల్ గారిని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ జీవన్ కుమార్, జీహెచ్‌ఎం సరళ, జీహెచ్‌ఎం గోపాల్, జ్యోతిలాల్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
TAGS: Achampet News, Haritha Foundation, Dr APJ Abdul Kalam Contest, MEO Jivan Kumar, ISRO visit for students, Education news Achampet, Jyothilal Haritha Foundation, Kalam elocution contest Achampet, Haritha Foundation Achampet, Dr APJ Abdul Kalam life and contributions, Achampet student competitions, ZPHS Girls School Achampet, Mandal level elocution competition, MEO Jivan Kumar, girl students education Telangana, student educational tour Hyderabad, ISRO Hyderabad visit students, Birla Planetarium Hyderabad tour, Science Museum Hyderabad, Nagarkurnool district education news, student inspiration programs Telangana
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com