నాగర్ కర్నూలు / హైదరాబాద్: రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల (Best Available Schools) విద్యార్థుల సంక్షేమంపై రాజీ పడే ప్రసక్తే లేదని, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
బకాయిల నెపంతో వేధిస్తే ఊపేక్షించం: సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి అందాల్సిన బకాయిల పేరుతో ఏ పాఠశాల యాజమాన్యమైనా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలల్లో వసతులు, భోజనం మరియు విద్యా నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు.
నాగర్ కర్నూలు జిల్లా వివరాలు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలోని పరిస్థితిని వివరిస్తూ ఆయన సమగ్ర నివేదిక సమర్పించారు:
ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో: 8 పాఠశాలల్లో 208 మంది విద్యార్థులు.
సామాజిక సంక్షేమ శాఖ పరిధిలో: 9 పాఠశాలల్లో 1,159 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
జిల్లాలోని ఈ పాఠశాలల్లో విద్యార్థులకు వసతి, నాణ్యమైన భోజనం మరియు విద్యా సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయని కలెక్టర్ నివేదించారు. తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి వసతులను పర్యవేక్షిస్తున్నానని, విద్యార్థుల హాజరు మరియు బోధన నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
పాల్గొన్న అధికారులు: ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఫిరంగి, మైనార్టీ శాఖ అధికారి గోపాల్ నాయక్, సామాజిక సంక్షేమ శాఖ పర్యవేక్షకురాలు రాగమణి, కవిత తదితర అధికారులు పాల్గొన్నారు.
TAGS : Bhatti Vikramarka, Best Available Schools, Nagarkurnool Collector, Tribal Welfare Schools, SC Welfare Schools Telangana, Education News Telangana, Deputy CM Bhatti Vikramarka, Minister Adluri Laxman Kumar, Best Available Schools Telangana, student welfare review meeting, Nagarkurnool Collector Badavath Santosh, Telangana education welfare schemes, residential school facilities review, government student welfare programs, Nagarkurnool district education news, social justice education Telangana
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com