లింగాల/అంబటిపల్లి:
అచ్చంపేట శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు డా. చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు గారు లింగాల మండలం, అంబటిపల్లి గ్రామంలో పర్యటించారు.
గ్రామ పంచాయతీ వద్ద ప్రజలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను, గ్రామ అవసరాలను శ్రీనివాస్ రావు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక వసతులపై స్థానికులు ఆయనకు విన్నవించుకున్నారు.
ప్రజల సమస్యలను విన్న వెంటనే రంగినేని శ్రీనివాస్ రావు గారు... తక్షణమే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలు కోరుతున్న సౌకర్యాలు మరియు సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం లభించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ గారు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయనిచ్చిన ఆదేశాల మేరకే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్ జనార్ధన్, మండల మాజీ వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్, స్థానిక నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
TAGS: Rangineni Srinivas Rao, Ambattipally Village Problems, Lingala Mandal, MLA Vamshikrishna Instructions, Congress Leader Achampet, Public Grievance Redressal, Achampet MLA Dr Vamshikrishna, Vamshikrishna instructions, Senior Congress leader Rangineni Srinivas Rao, Rangineni Srinivas Rao Congress, Ambattipally village, Lingala Mandal, public grievances redressal, grievance resolution village level, coordination with officials, grassroots governance Telangana, Congress leaders field visit, Achampet constituency development, Nagarkurnool district news, people’s issues resolved, local administration Telangana, Congress service activities
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com