- ఆధ్యాత్మికత, ఐక్యత, మానవతా విలువలకు ప్రతీక దీపోత్సవం: డాక్టర్ వంశీకృష్ణ
- ప్రజలతో కలిసి దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే దంపతులు
నగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని భీమ లింగేశ్వర స్వామి దేవస్థానం మరియు కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించిన కోటి దీపోత్సవం మహోత్సవ వేడుకలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట శాసనసభ సభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు వారి సతీమణి, సీబీఎం ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ప్రసంగిస్తూ.. కోటి దీపోత్సవం మన ఆధ్యాత్మికత, ఐక్యత, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ దీపోత్సవం ప్రతి మనసులో శాంతిని, ప్రతి ఇంటిలో వెలుగును నింపాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ప్రేమ, సౌభ్రాతృత్వం, సానుకూలతల వెలుగులు మన సమాజాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు. కోటి దీపోత్సవం భారతీయ సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబించే గొప్ప ఆధ్యాత్మిక మహోత్సవం అని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే దంపతులు ప్రజలతో కలిసి దీపాలు వెలిగించి, ఈ వేడుకలో భక్తిశ్రద్ధలతో భాగమయ్యారు. నిర్వాహకులను అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మనసులో వెలుగులు నింపుతాయని, సమాజంలో శాంతి, సానుకూలతను పెంపొందిస్తాయని అన్నారు.
TAGS: Koti Deepotsavam Achampet, MLA Dr Vamsi Krishna, Bhima Lingeshwara Swamy Temple, Kanyaka Parameswari Temple Achampet, Spiritual events Telangana, Nagarkurnool news, Koti Deepotsavam Achampet, Bhima Lingeshwara Swamy Temple, Kanyaka Parameswari Temple Achampet, Achampet MLA Dr Chikkudu Vamsi Krishna, Dr Anuradha CBM Trust, Nagarkurnool district temples, Koti Deepotsavam festival Telangana, spiritual festival Achampet, temple celebrations Nagarkurnool, Hindu religious events Telangana, mass lamp festival, cultural unity and harmony, devotional celebrations Achampet, Telangana temple festivals
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com