నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్‌లోని ఆక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ సిబ్బంది ‘SPARSH’ కార్యక్రమం లో భాగంగా మంగళవారం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంకింగ్ సేవలు, వాటి ప్రాధాన్యత గురించి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా, పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులను ఆక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌కు ఆహ్వానించారు. బ్యాంక్ సిబ్బంది విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలు ఎలా పనిచేస్తాయో, వాటి ప్రాధాన్యం ఏమిటో వివరించారు.
విద్యార్థులకు ATM వినియోగం, లోన్స్ (రుణాలు), క్రెడిట్ కార్డులు, డిపాజిట్లు, విత్‌డ్రావల్స్ వంటి అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, బ్యాంక్ అందించే విభిన్న సేవలు, ఆర్థిక నిర్వహణలో బ్యాంకింగ్ వ్యవస్థ పాత్ర గురించి సిబ్బంది అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ... పల్లవి మోడల్ స్కూల్ మేనేజ్‌మెంట్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆక్సిస్ బ్యాంక్ సేవలు పాఠశాలలకు మాత్రమే కాకుండా, సమాజంలోని ఆఫీసులు, హాస్పిటల్స్, వ్యాపార కేంద్రాలు వంటి అన్ని రంగాలకు అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ అనిల్ కుమార్, గోల్డ్ లోన్ మేనేజర్ చంద్రకాంత్, గుండ్ల శ్రీకాంత్, ముస్తఫా తదితర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
TAGS: Axis Bank Nagarkurnool, SPARSH Program, Pallavi Model School, Banking Awareness, ATM Usage, Anil Kumar, Financial Literacy, Axis Bank Nagarkurnool, SPARSH awareness program, Axis Bank SPARSH initiative, Pallavi Model School Nagarkurnool, banking awareness for students, ATM usage education, financial literacy program, banking services awareness, loans and deposits information, school awareness program Telangana, Axis Bank CSR activities, Anil Kumar Branch Manager Axis Bank, Nagarkurnool education news, student financial literacy, Telangana banking news
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com