ఉప్పునుంతల/వెల్టూర్:
నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ జెడ్పీ హైస్కూల్ మైదానంలో శనివారం నాడు 35వ సబ్ జూనియర్ కబడ్డీ ఆట బాల బాలికల జట్ల ఎంపిక (సెలెక్షన్స్) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
ఈ సెలెక్షన్స్ కోసం జిల్లా నలుమూలల నుండి వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మొత్తం 206 మంది బాల బాలికలు ఎంపికల్లో పాల్గొని తమ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వీరిలో బాలికలు 120 మంది కాగా, బాలురు 86 మంది ఉన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా తమ ఆటను కనబరచడం మైదానంలో క్రీడా స్ఫూర్తిని నింపింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు జనార్థన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ పాల్గొని ఎంపికలను పర్యవేక్షించారు. పెద్దలు, అసోసియేషన్ సభ్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు ఆడిన ఆటను, వారి నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ జిల్లా జట్లకు అవసరమైన క్రీడాకారులను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రంగారెడ్డి, లింగమయ్య, శ్రీనివాసులు, నాయకులు బాల్ రెడ్డి, మల్లయ్య, ఉప్పరి బాలరాజు, గుద్ధటి బాలరాజు, సమ్మదు, శాఖిల్, నాగరాజు, సయ్యద్, నాగార్జున, తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
TAGS: Nagarkurnool Kabaddi Selections, 35th Sub-Junior Kabaddi, Veltur Uppununtala, Kabaddi Trials, Janardhan Reddy Yadaiya Goud, District Kabaddi Association, 35th Sub Junior Kabaddi selections, Sub Junior Kabaddi Telangana, Kabaddi team selections Nagarkurnool, ZP High School Veltur, Uppununtala Mandal, Nagarkurnool district sports, boys girls Kabaddi selections, District Kabaddi Association, Janardhan Reddy Kabaddi, 206 students participated, school sports Telangana, Kabaddi trials Telangana, youth sports development, Telangana Kabaddi news, district level sports events
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com