- సంక్రాంతి, వారంతపు సెలవు మరియు రంగాపూర్ ఉర్సు సందర్భంగా నిర్ణయం - తిరిగి సోమవారం (జనవరి 19) నుండి మార్కెట్ ప్రారంభం: కార్యదర్శి ప్రకటన
అచ్చంపేట: సంక్రాంతి పండుగ మరియు రంగాపూర్ ఉర్సు జాతరను పురస్కరించుకుని అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వరుస సెలవులను ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ (బుధవారం) నుండి 18వ తేదీ (ఆదివారం) వరకు మొత్తం ఐదు రోజుల పాటు మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని మార్కెట్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
సెలవుల వివరాలు:
జనవరి 14 (బుధవారం) నుండి 16 (శుక్రవారం): సంక్రాంతి పండుగ సెలవులు.
జనవరి 17 (శనివారం): వారంతపు సెలవు.
జనవరి 18 (ఆదివారం): అమావాస్య మరియు రంగాపూర్ ఉర్సు జాతర సందర్భంగా సెలవు.
రైతులకు సూచన: వరుస సెలవుల కారణంగా రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని కార్యదర్శి సూచించారు. తిరిగి జనవరి 19 (సోమవారం) నుండి మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com