మన్ననూర్ హాస్టల్‌లో కలెక్టర్ సందడి - విద్యార్థినులతో ఆత్మీయ సంభాషణ!
ఆకస్మిక తనిఖీ: వసతి గృహ అధికారులకు కలెక్టర్ సీరియస్ వార్నింగ్.
మెనూ ప్రకారం భోజనం అందుతోందా? - స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్.
గిరిజన బాలికల సంక్షేమమే లక్ష్యం - కలెక్టర్ బాదావత్ సంతోష్.
వంటగది, బాత్‌రూమ్‌ల పరిశీలన.. పరిశుభ్రతపై కలెక్టర్ కీలక ఆదేశాలు.
మన్ననూర్ (నాగర్ కర్నూల్): నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థినులకు అందుతున్న భోజన సదుపాయాలు, ఇతర వసతులపై ఆయన ఆరా తీశారు.
తనిఖీలో భాగంగా కలెక్టర్ విద్యార్థినులతో నేరుగా మాట్లాడి.. చదువు ఎలా సాగుతోంది? మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతోందా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగది, భోజనశాల, పడకగదులు మరియు మరుగుదొడ్లను స్వయంగా పరిశీలించారు. తాగునీటి సదుపాయం మెరుగుపరచాలని, వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
వంటగదిలో పరిశుభ్రత పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థినుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. హాజరు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. గిరిజన విద్యార్థినుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఏవైనా సమస్యలుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి మరియు వసతి గృహ అధికారులు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com