నాగర్‌కర్నూలు: జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టి, నాగర్‌కర్నూల్‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాదకద్రవ్యాల సరఫరా వెనుక ఉన్న మూలాలను గుర్తించి గట్టి దెబ్బ కొట్టాలని, ఇందుకోసం పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. గత ఏడాది నమోదైన 9 కేసుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని అదనపు ఎస్పీని ఆదేశించారు. విద్యాసంస్థల సమీపంలో మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఒకవేళ పాఠశాల సిబ్బంది ఎవరికైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. మత్తుకు బానిసైన వారికి కనీసం 6 నెలల పాటు కౌన్సిలింగ్, వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ, డీఎంహెచ్ఓ, డీఈఓ తదితరులు పాల్గొన్నారు.
Collector Badavath Santosh, Nagarkurnool Drugs Control, Drug Free Nagarkurnool, Narcotics Control Committee, Telangana Police Drugs Raid
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com