హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంది. తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు వేగంగా తిరోగమనం (Withdrawal) చెందుతున్నాయి. ఇప్పటికే అక్టోబర్ 13 నాటికి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ వరకు వెనక్కి తగ్గిన రుతుపవనాలు, మరో కొన్ని గంటల్లో రాష్ట్రం నుంచి పూర్తిగా నిష్క్రమించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రుతుపవనాల ఉపసంహరణ జరుగుతున్న క్రమంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని ప్రభావంతో అక్టోబర్ 14, 15 తేదీల్లో తెలంగాణలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ తీర ప్రాంత జిల్లాల్లో మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వారం చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనుదిరగనున్నాయి.
నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ముగిసి, శీతాకాలం ప్రారంభం కానుంది. వచ్చే సోమవారం అమావాస్య ముగిసిన వెంటనే కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో, అదే సమయం నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
TAGS: Southwest Monsoon Withdrawal 2025, Telangana Weather Update, Winter Season in India, AP Rain Alert, Weather Yellow Alert Telangana, Southwest monsoon withdrawal Telangana, monsoon withdrawal Andhra Pradesh, weather department yellow alert, Telangana weather update, AP weather news today, winter season Kartika Masam, IMD weather forecast, post monsoon weather Telangana, seasonal change India, Telangana rainfall alert
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com