అరియ నాగసేన బోధి
"దుక్ఖం ఉనికిని గుర్తించడం, దుక్ఖాన్ని తొలగించే మార్గాన్ని అన్వేషించడమే ధర్మానికి పునాది." ఈ మాటలతో బోధిసత్త్వుడు డా. బి.ఆర్. అంబేడ్కర్ భగవాన్ బుద్ధుని ధర్మ తాత్పర్యాన్ని అత్యంత గంభీరంగా వ్యక్తం చేశారు.
గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 563లో నేపాల్ సరిహద్దులోని కపిలవస్తు రాజ్యంలో శాక్య తెగలో జన్మించారు. రాజకుమారుడిగా జన్మించిన ఆయన, తన 29వ ఏట సంసారాన్ని విడిచి సత్యాన్వేషణకు బయలుదేరారు. 35వ ఏట బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందుతూ బుద్ధుడు అయ్యారు. 80వ ఏట క్రీ.పూ. 483లో కుసినార వద్ద మహాపరినిర్వాణం పొందారు.
బుద్ధుని బోధనలు – మానవ చైతన్యానికి మార్గం
భగవాన్ బుద్ధుడు జీవితాన్ని “దుక్ఖ సత్యం” నుండి ప్రారంభించాడు. దుక్ఖం అనేది మానవ జీవితంలో అంతర్భాగమని, కానీ దానిని జ్ఞానం, శీలం, ధర్మం ద్వారా అధిగమించవచ్చని బోధించారు.
భగవాన్ బుద్ధుడు చెప్పిన అరియ అష్టాంగ మార్గం సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవికం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి ఇవి మానవ వికాసానికి పూర్తి పథమార్గం.
భగవాన్ బుద్ధుని ప్రకారం, “కాంక్ష నుంచే దుక్ఖం జనిస్తుంది.” కాంక్షను జయించినవారికి దుక్ఖమూ లేదు, భయమూ లేదు. ఈ మాటలు మనసును విముక్తి వైపు నడిపిస్తాయి.
అజ్ఞానంనే దుక్ఖానికి మూలమని ఆయన చెప్పారు. విద్య, జ్ఞానం, దయ ఇవే దానిని తొలగించే మూడు దీపాలు.
మధ్యమ మార్గం – జీవన సమతుల్యతకు చిహ్నం.
బ్రాహ్మణ సిద్ధాంతంలో హింసను సమర్థించే వృత్తి ఉంది. జైనమతంలో హింసకు పూర్తి వ్యతిరేకత ఉంది. కానీ భగవాన్ బుద్ధుడు చెప్పిన మధ్యమ మార్గం సమతుల్య జీవన పథం. అది హింస, అహింస అంచుల్లో కాదు. మానవ కరుణ, జ్ఞానం మధ్యలో నిలబడి ఉంది.
బౌద్ధ ధర్మం – పంచశీల సూత్రాల పునాది.
పంచశీల అంటే –
1️⃣ హింస చేయకూడదు.
2️⃣ దొంగతనం చేయకూడదు.
3️⃣ అసత్యం మాట్లాడకూడదు.
4️⃣ వ్యభిచారం చేయకూడదు.
5️⃣ మత్తుపదార్థాలు తీసుకోకూడదు.
ఈ ఐదు నియమాలు కేవలం మతసూత్రాలు కాదు - మానవ సమాజం నిలబడే పునాదులు.
బుద్ధుని వారసత్వం – శాంతి, సమానత్వం, జ్ఞానం.
భగవాన్ బుద్ధుడు మానవ చరిత్రలో జ్ఞానోదయానికి చిహ్నం. ఆయన చెప్పిన మార్గం మతానికి కాదు- మానవతకు.
“చెడును దూరంగా ఉంచుకో, మంచిని పెంపొందించుకో, నీ మనసును శుద్ధి చేసుకో.” ఇదే బౌద్ధ జీవన విధానం.
ప్రపంచమంతా బుద్ధుని కీర్తించిన వాక్యాలు.
“నా దృష్టిలో భారతీయులందరిలోకి మహోన్నతుడు తథాగత గౌతమ బుద్ధుడే.” – అమర్త్యసేన్, నోబెల్ బహుమతి గ్రహీత
“ఈ ప్రపంచంలో జన్మించిన అందరిలోనూ సర్వశ్రేష్ఠుడు బుద్ధుడే.” – రవీంద్రనాథ్ ఠాగూర్
“బుద్ధుని అభిమానించే కొలదీ తెలుసుకోగలం, తెలిసిన కొలదీ అభిమానించగలం.” – ఆర్యోక్తి
మానవుడిగా బుద్ధుడు, దివ్యుడిగా మారిన జ్ఞానదీపం.
భగవాన్ బుద్ధుడు దేవుడు కాదు - ఆయన మానవుడు, కానీ తన మానవత్వాన్ని జ్ఞానం ద్వారా దివ్యత్వంగా మలిచాడు. అందుకే ఆయన బోధనలు ఏ యుగానికైనా, ఏ మతానికైనా, ఏ మనిషికైనా స్ఫూర్తి.
“బుద్ధుడు మానవుడి ఆత్మలో వెలిగే దీపం.”
దానిని గౌరవించడం అంటే స్వంత జ్ఞానాన్ని గౌరవించడం.
TAGS: Gautama Buddha History, Aryan Eightfold Path, Panchsheel Principles, Buddhist Philosophy, Ambedkar on Buddha, Middle Way Buddhism, Gautama Buddha philosophy, Dr B.R. Ambedkar Buddhism, Four Noble Truths, Eightfold Path teachings, Middle Way Buddhism, Ambedkar interpretation of Buddha, Buddhist principles India, Buddha philosophy explained, Ambedkar Buddhist thought, Indian Buddhism study, spiritual teachings Buddha, Ambedkar and Buddhism, Buddhism for social reform, Dharma teachings India, Buddha philosophy guide
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com