వంగూరు/కొండరెడ్డిపల్లి:
దసరా (విజయదశమి) పండుగను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు తన స్వగ్రామమైన అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం, కొండరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లమల ముద్దుబిడ్డగా కొండరెడ్డిపల్లి గ్రామస్తుల మధ్య దసరా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి గారితో కలిసి, టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు గ్రామంలోని జమ్మి చెట్టును దర్శించుకున్నారు. వారు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరికీ చెడుపై మంచి విజయం సాధించిన ఈ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్ గారు కూడా పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.
TAGS: CM Revanth Reddy Dasara, Kondareddypally Jami Chettu, MLA Vamshikrishna Achampet, Vangur Mandal, Telangana Dasara Celebrations, Gampuram Rajender, Telangana CM Revanth Reddy Dasara, Kondareddypally Dasara celebrations, Jami Chettu puja, Achampet MLA Dr Vamshikrishna, Library Chairman Rajender, Telangana Dasara festival, traditional Dasara rituals, CM native village celebrations, Telangana cultural traditions, Vijayadashami celebrations Telangana, political leaders Dasara puja, Telangana festival news
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com