- కొత్త విద్యా విధానంపై సమగ్ర నివేదిక అందజేత - "స్టడీ వైల్ ప్లేయింగ్ గేమ్స్", "అరౌండ్ ది స్టూడెంట్స్ క్లాస్‌రూమ్" వంటి వినూత్న అంశాలపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ డా. వి. బాలకిష్టారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని మండలి కార్యాలయంలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన విజువల్ విద్యా రూపకర్త బసవోజు దేవేంద్రాచారి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, విద్యా సంస్కరణలపై రూపొందించిన నివేదికను అందజేశారు.
నివేదికలోని ప్రధాన ప్రతిపాదనలు:
ఏకాగ్రత పెంపు: తరగతి గదుల్లో కిటికీలను 48 ఫీట్ల ఎత్తు వరకు మూసివేయడం ద్వారా విద్యార్థుల ఏకాగ్రతను పెంచవచ్చని దేవేంద్రాచారి ప్రతిపాదించారు.
ప్రజెక్ట్ ఆధారిత బోధన: ప్రతి సబ్జెక్ట్‌కు ప్రత్యేక క్లాస్‌రూమ్‌లు, మల్టీ లాంగ్వేజ్ క్లాస్‌రూమ్ విధానం అమలు చేయాలని సూచించారు.
అరౌండ్ ది స్టూడెంట్స్: విద్యార్థుల చుట్టూ ప్రాక్టీస్ బోర్డ్స్ ఉండేలా తరగతి గదుల నిర్మాణం ఉండాలని వివరించారు.
ఆటపాటల చదువు: "స్టడీ వైల్ ప్లేయింగ్ గేమ్స్" (ఆడుతూ చదువుకోవడం) విధానాన్ని DSC, SCERT స్థాయిలో ప్రవేశపెట్టాలని, వారంలో ప్రతి రోజు ఒక సబ్జెక్ట్ గేమ్‌ను (సోమవారం మాథ్స్, మంగళవారం తెలుగు..) నిర్వహించాలని ప్రతిపాదించారు.
పార్క్ (PARK) సెంటర్స్: ప్రపంచంలోనే తొలిసారిగా పర్యటన ఆధారిత రీసెర్చ్ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
దేవేంద్రాచారి చేసిన ఈ సూచనలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, వీటిని ఉన్నత విద్యా మండలి పరిశీలిస్తుందని చైర్మన్ బాలకిష్టారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, దేవేంద్రాచారి రూపొందించిన వి.వి విధాన బుక్‌లెట్‌ను ఆయన ఆవిష్కరించారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com