నల్లమలలో పులుల వేట కాదు.. పులుల లెక్క!
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో మొదలైన గణన.
రంగంలోకి సిబ్బంది, వాలంటీర్లు.. నిఘా నీడలో నల్లమల.
ఈర్లపడేలు అడవుల నుంచి పులుల గణన శ్రీకారం.
నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ అభయారణ్యంలో మంగళవారం నుంచి అధికారికంగా పులుల గణన కార్యక్రమం ప్రారంభమైంది. అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని ఈర్లపడేలు అటవీ ప్రాంతం నుంచి అటవీ శాఖ అధికారులు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఈ గణనలో అటవీ సిబ్బందితో పాటు వాలంటీర్లు, పొరుగు సేవల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. బృందాలుగా విడిపోయిన సిబ్బంది సోమవారం రాత్రే తమకు కేటాయించిన బీట్లకు చేరుకున్నారు. ఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ డా. సునిల్ హిరామత్ స్వయంగా సిబ్బందితో కలిసి ఈర్లపడేలు అడవుల్లో పర్యటించి గణనను పర్యవేక్షించారు.
గణనలో పాల్గొనే సిబ్బందికి బేస్ క్యాంపుల వద్ద మెరుగైన వసతులు కల్పించాలని ఫీల్డ్ డైరెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టైగర్ ఎన్టీవో బాపురెడ్డి, బయాలజిస్ట్ మహేందర్ తదితరులు పాల్గొని శాస్త్రీయ పద్ధతిలో వివరాలను సేకరిస్తున్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com