అచ్చంపేట:
వినాయక చవితి వేడుకల సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ... స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పట్టణంలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్టణంలోని టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, సిద్ధి వినాయక మండపం, పద్మావతి కాలనీ, మధుర నగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఆ గణనాథుడి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని, అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. అచ్చంపేట పట్టణంలోని అన్ని కాలనీలను అభివృద్ధిలో భాగం చేస్తామని, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ పూజా కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి గణపతి ఆశీస్సులు పొందారు.
TAGS: MLA Vamshikrishna Ganesh Chaturthi, Achampet Ganesha Puja, Dr. Chikkudu Vamshikrishna, Ganesha Idols Achampet, Telangana MLA Puja, Colony Ganesha, Achampet MLA Dr Vamshikrishna, Dr Vamshikrishna Ganesh Chaturthi, Ganesh Chaturthi Achampet, Vinayaka Chavithi celebrations, Ganesha idol puja Achampet, Teachers Colony Achampet, Srinagar Colony Achampet, festival celebrations Telangana, political leaders Ganesh puja, public welfare wishes, prosperity peace wishes, Achampet constituency news, Nagarkurnool district festivals, Telangana Ganesh Chaturthi news, community celebrations Achampet
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com