రోడ్డుపై ప్లాస్టిక్ ఏరిన టీవీ5 జర్నలిస్ట్ బాలకృష్ణ
టోల్ వసూళ్లు ఉన్నాయి కానీ సంరక్షణ లేదు!
ప్లాస్టిక్ పీడతో వన్యప్రాణులకు ముప్పు
జర్నలిస్ట్ బాలకృష్ణ వినూత్న నిరసన
వసూళ్లు తప్ప.. అడవిని కాపాడేది ఎవరు?
నల్లమల/గుండం: శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ కాలుష్యం భయంకరంగా మారుతోంది. ఈ క్రమంలో టీవీ5 జర్నలిస్ట్ బాలకృష్ణ స్వయంగా రోడ్డు పక్కన పడి ఉన్న ప్లాస్టిక్ చెత్తను ఏరుతూ కనిపించారు. ఒక జర్నలిస్ట్‌గా వార్తలు అందించడమే కాకుండా, పర్యావరణంపై ఆయన చూపిన బాధ్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అటవీ శాఖ వైఫల్యంపై విమర్శలు: నల్లమల అడవిలోకి ప్రవేశించే ప్రతి వాహనం నుంచి టోల్ గేట్ వద్ద భారీగా ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు, క్షేత్రస్థాయిలో అడవిని కాపాడటంలో విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్లాస్టిక్ నియంత్రణ కోసం "ప్రొటెక్షన్ వాచర్లు" ఉన్నప్పటికీ, అడవిలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.
ప్రశ్నిస్తున్న ప్రజలు: "ఫీజులు వసూలు చేస్తున్నారు.. వాచర్లను పెట్టుకున్నారు.. మరి ఫలితం ఎక్కడ?" అని వాహనదారులు, పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల వన్యప్రాణులు ఈ ప్లాస్టిక్ తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ చేసిన ఈ పని అధికారుల కళ్లు తెరిపించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com