అచ్చంపేట: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తన పాటలతో కోట్లాది మందిలో విప్లవ స్ఫూర్తిని రగిలించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి 78వ జయంతి వేడుకలు అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. అమరవీరుల స్థూపం వద్ద TJAC అచ్చంపేట మరియు గద్దర్ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా టిజేఏసీ (TJAC) చైర్మన్ కాశన్న యాదవ్ మరియు రాష్ట్ర నేత శ్రీనివాస్ మాట్లాడుతూ.. గద్దర్ గారు కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదని, పీడిత ప్రజల గొంతుక అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అన్యాయాలను తన ఆటపాటలతో ఎండగట్టి, ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంట్‌లో బిల్లు వచ్చే వరకు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల అపారమైన గౌరవంతో, దేశవ్యాప్తంగా రాజ్యాంగ అమలు యాత్రకు శ్రీకారం చుట్టిన తరుణంలో ఆయన మనకు దూరం కావడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయ సాధనకై రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగడమే గద్దర్ అన్నకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెవ్వ పాండు, అర్జున్, రవికుమార్, మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
TAGS: Gaddar Birth Anniversary, Achampet TJAC News, Kashanna Yadav, People's Balladeer Gaddar, Telangana Movement, Indian Constitution Gaddar Yatra, Gaddar 78th birth anniversary, Balladeer Gaddar tributes, Achampet Gaddar memorial, Martyrs Memorial Achampet, TJAC Achampet program, Gaddar Memorial Committee, Telangana folk singer Gaddar, People’s Warship Gaddar, Telangana statehood movement, Gaddar revolutionary songs, Ambedkar ideology Gaddar, Indian Constitution democracy, Constitution Implementation Yatra, social justice movement Telangana, Amaraveerula Sthupam Achampet, Kashanna Yadav TJAC Chairman, Srinivas state leader, Gaddar legacy Telangana
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com