అమ్రాబాద్ మండలం వటువర్ల పల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల భారీగా బీజేపీలోకి చేరిక • జూబ్లీహిల్స్ గెలిచిన మురిపంలో కాంగ్రెస్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శ
వటువర్ల పల్లి (అమ్రాబాద్): అచ్చంపేట నియోజకవర్గం, అమ్రాబాద్ మండలం, వటువర్ల పల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు కర్నాటి శ్రీనివాసులుతో పాటు పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నేడు మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి గువ్వల బాలరాజు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
నల్లమల గడ్డపై కాషాయ జెండా:
ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. నల్లమల అచ్చంపేట గడ్డ మీద త్వరలోనే కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం లోకి వస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రజా సమస్యలను గాలికొదిలేసింది:
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరుపై గువ్వల బాలరాజు తీవ్ర విమర్శలు చేశారు. కేవలం జూబ్లీహిల్స్ గెలిచిన మురిపంలో మునిగిపోయి, రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలను కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
జాతీయ పార్టీ ఉనికి కోల్పోయింది:
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతోందని ఆయన గుర్తు చేశారు. బీహార్‌లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం ఆరు సీట్లలో మాత్రమే గెలిచిందని, ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా పునరావృతమై, బీహార్ మాదిరిగా బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మంగ్య నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజ్, మండల ఎన్నికల ఇంచార్జ్ జానకి, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, మహేష్ యాదవ్, మహేందర్, శంకర్ మాదిగ, గోలి రాజ్, అనిల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
TAGS: BJP Achampet, Guvvala Balaraju, Vatuvarlapally BJP News, Amrabad Political News, Telangana BJP Joinings, Congress vs BJP Telangana, Nagarkurnool Politics, BJP gains Vatuvarlapally, Amrabad BJP news, Congress leaders join BJP Telangana, Guvvala Balaraju BJP event, Karnati Srinivasulu joins BJP, Telangana political news, Achampet constituency BJP, BJP vs Congress Telangana, Telangana election updates, BRS leaders join BJP, BJP expansion Amrabad, Telangana saffron party growth, Congress decline Telangana, BJP political boost Nagarkurnool, local politics Vatuvarlapally, Nallamala Region BJP, Guvvala Balaraju Statement, కాషాయ జెండా అచ్చంపేట Kashaya Jenda Achampet, Amrabhad Mandal Politics, Vatuvarlapally BJP Joining, Congress State Issues Neglect, Jubilee Hills Muripam Political critici
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com