హైదరాబాద్: రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచే దిశగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకు ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి ఆయన ఒక కీలక అంతర్గత లేఖ రాశారు.
సివిల్ వివాదాలు కోర్టుల పరిధిలోనే: సివిల్ వివాదాలు పూర్తిగా సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయన్న ప్రాథమిక విషయం ప్రతి పోలీసు అధికారికి తెలుసని, అయినప్పటికీ కొన్ని చోట్ల పోలీసులు జోక్యం చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డీజీపీ పేర్కొన్నారు. "సివిల్ వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేసినా, లేదా వాటిలో తలదూర్చినా సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు అధికారులపై తక్షణమే వేటు పడుతుందని" ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
అవినీతికి తావులేదు: పోలీసు యూనిఫామ్ మరియు అవినీతి ఎప్పటికీ కలిసి ఉండకూడదని డీజీపీ ఉద్ఘాటించారు. "అవినీతి, అక్రమాలపై కేసులు నమోదు చేసి నిందితులను న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే.. వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా పోతుందని" ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖలోని ముఖ్యాంశాలు:
తక్షణ చర్యలు: నిబంధనలు అతిక్రమించే అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయి.
హద్దులు మించొద్దు: పోలీసు విధులకు మాత్రమే పరిమితం కావాలి, సివిల్ సెటిల్మెంట్లకు కాదు.
ప్రజల నమ్మకం: పోలీసు శాఖ పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని కాపాడటం ప్రతి అధికారి బాధ్యత.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖలో పారదర్శకతను పెంచేందుకు డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
TAGS: DGP Shivadhar Reddy, Telangana Police discipline, Civil disputes police interference, Corruption in police force, Police internal memo, DGP Shivadhar Reddy warning, police interference civil disputes, Telangana police guidelines, Home Guard to IPS warning, strict action police violations, Telangana law and order news, police conduct rules Telangana, civil dispute police role, DGP advisory police personnel, Telangana police administration, misuse of power police, internal police instructions Telangana
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com