అచ్చంపేట (మార్చి 8, 2026): టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరగనున్న తుది పోరుపై యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ అచ్చంపేటలో సందడి నెలకొంది.
భారత్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అచ్చంపేట రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ప్రతినిధులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ, సభ్యులు ఉస్మాన్ మరియు శంకర్ మాట్లాడుతూ.. టీమ్ ఇండియా అద్భుత ఫామ్‌లో ఉందని, ఖచ్చితంగా వరల్డ్ కప్ నెగ్గి దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత ఆటగాళ్లు ప్రతిభ కనబరిచి న్యూజిలాండ్‌ను ఓడించాలని, కప్పుతో భారత్‌కు తిరిగి రావాలని ఆటో యూనియన్ తరపున ప్రత్యేకంగా వేడుకున్నట్లు వారు తెలిపారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com