న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్ల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ గురువారం (మార్చి 5) రాత్రి రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమించింది.
ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. 2024 జూలైలో తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ, దాదాపు ఏడాదిన్నర పాటు ఇక్కడ సేవలందించారు. ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో బాధ్యతలు చేపట్టనున్నారు.
ముఖ్యమైన నియామకాలు:
పశ్చిమ బెంగాల్: తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్ రవిని బెంగాల్‌కు బదిలీ చేశారు. గురువారం సాయంత్రం సి.వి.ఆనంద బోస్ రాజీనామా చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీహార్: సయ్యద్ హస్నేన్ బిహార్ నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆకస్మిక రాజీనామా తర్వాత కొద్ది గంటల్లోనే కేంద్రం ఈ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలిచే ఆర్.ఎన్ రవిని బెంగాల్‌కు పంపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com